సర్వదర్శన టోకెన్‌లను జారీ చేసిన టీటీడీ

26 Oct, 2020 08:06 IST|Sakshi

సాక్షి, తిరుపతి : ఉచిత సర్వదర్శన టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రారంభించింది. సోమవారం ఉదయం 5 గంటల నుంచే టీటీడీ టోకెన్‌లను జారీ మొదలుపెట్టింది. రోజుకు 3వేల చొప్పున ఉచిత టోకెన్‌లను ఇస్తుండటంతో తెల్లవారుజాము నుంచే భక్తులు కౌంటర్ల దగ్గర బారులు తీరారు. ప్రారంభించిన రెండు గంటల వ్యవధిలోనే టోకెన్‌లు అయిపోయాయి. కరోనా నేపథ్యంలో నిషేధం విధించిన సర్వదర్శనం ఏడు నెలల తర్వాత లభిస్తుండటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల నవంబరు కోటా విడుదల
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ పెంచింది. రేపు(మంగళవారం) ఉదయం 11 గంటల నుంచి నవంబరు కోటా టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అదనంగా 3 వేలు ప్రత్యేక ప్రవేశ దర్శనం, 3 వేల సర్వ దర్శన టికెట్లు కేటాయించింది. పెరిగిన దర్శన టికెట్లుతో రోజుకి 23 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం భాగ్యం కలుగుతుంది. 

తిరుమల సమాచారం..
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య: 16,043
స్వామివారి తీలనీలాలు సమర్పించిన భక్తులు సంఖ్య: 5,405
స్వామివారి హుండి ఆదాయం: 1.24లక్షలు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు