5న వీఐపీ బ్రేక్‌ దర్శనం లేదు: టీటీడీ

29 Sep, 2021 05:17 IST|Sakshi
సీతారామలక్ష్మణ సమేత స్వామి వారికి హారతి ఇస్తున్న అర్చకులు

తిరుమల: అక్టోబర్‌ 5న తిరుమలలో బ్రేక్‌ దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు టీటీడీ పీఆర్‌వో విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 7 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్‌ 5న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కారణంగా అక్టోబర్‌ 4న వీఐపీ బ్రేక్‌ దర్శనాల కోసం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. 

నాదనీరాజనంపై బాలకాండ పారాయణం 
తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం బాలకాండలోని 3 నుంచి 7వ సర్గ వరకు ఉన్న మొత్తం 142 శ్లోకాలను పండితులు పఠించారు. బాలకాండ పారాయణం నిర్వహిస్తోన్న ఎస్వీ వేద వర్సిటీ ఆధ్యాపకులు ఆచార్య ప్రవా రామక్రిష్ణ సోమయాజులు మాట్లాడుతూ.. ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఈ పారాయణాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద వర్సిటీ అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు, రాష్ట్రీయ సంస్కృత వర్సిటీకి చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు