విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత 

6 May, 2021 12:18 IST|Sakshi

సాక్షి, విజయనగరం: విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ముచ్చు నాగలక్ష్మి(47) మంగళవారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విజయనగరంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకటో డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలు పొందిన ఆమె మార్చి 18న డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. నాగలక్ష్మికి భర్త శ్రీనివాసరావు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కాగా ఆమె మృతిపై కార్పొరేషన్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ ప్రసాదరావు, ఇతర విభాగాల అధికారులు సంతాపం తెలుపుతూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదవి చేపట్టిన అనతికాలంలోనే మరణించడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ వెంకటేశ్వరరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ సత్యనారాయణ, ఈఈ డాక్టర్‌ దిలీప్, కార్పొరేషన్‌ పాలకవర్గ సభ్యులు తమ సంతాపం తెలియజేశారు. 

చదవండి: మరి ఇలాగైతే కరోనా రాదా అండీ....?

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు