ప్రేమపెళ్లి: తిరుపతి జిల్లా బుచ్చినాయుడిపల్లిలో దారుణం

7 Oct, 2022 12:36 IST|Sakshi

సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న అబ్బాయి ఇంటిపై అమ్మాయి తరపు వారు దాడి చేశారు. రెండు నెలల క్రితం డాక్టర్‌ సుష్మా, వంశీకృష్ణ ప్రేమవివాహం చేసుకున్నారు. దీంతో పెళ్లి ఇష్టంలేని అమ్మాయి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అబ్బాయి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. అనంతరం ఆ యువతిని అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: ('ఆ పాత్ర చూస్తుంటే అల్లావుద్దీన్‌ ఖిల్జీ, ఒసామాబిన్‌ లాడెన్‌ గుర్తొస్తున్నారు')

మరిన్ని వార్తలు