రోడ్డు ప్రమాదంలో తల్లి, పిల్లల మృతి

13 Nov, 2023 06:54 IST|Sakshi

మనోహరాబాద్‌(తూప్రాన్‌): తల్లి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడుతో కలిసి స్కూటీపై శుభకార్యానికి వెళ్ళి ఇంటికి వస్తున్న క్రమంలో లారీ ఢీకొంది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. పాప మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రాంనగర్‌కు చెందిన మహ్మద్‌ అహ్మద్‌ కూతురైన మలైక (30) రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని బాబాగూడలోని ఒక శుభ కార్యానికి తన పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్లింది.

శుభకార్యం ముగించుకుని తిరిగి మెదక్‌కు వస్తున్న క్రమంలో మనోహరాబాద్‌ మండలం కాళ్ళకల్‌ శివారులోని జాతీ య రహదారిపై వెనుక నుంచి వచ్చిన ఒక లారీ అదుపు తప్పి వారి స్కూటీపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆమెతో పాటు ఇద్దరు పిల్లలు అద్నాన్‌, సుల్తాన అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు