అందరికీ అమ్మ.. వైఎస్‌ జయమ్మ 

25 Jan, 2021 10:39 IST|Sakshi

సర్పంచ్‌గా సేవలు.. 

రోటరీ క్లబ్‌ ద్వారా సమాజ సేవ

అందరి కష్టంలో పాలుపంచుకున్న వైనం 

నేడు వైఎస్‌ జయమ్మ 15వ వర్ధంతి

పులివెందుల : అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు.. కానీ ఏమీ అడగకుండానే అందరికి అన్నీ పంచి ఇచ్చిన అమ్మ వైఎస్‌ జయమ్మ. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాతృమూర్తి వైఎస్‌ జయమ్మ. ఆమె జీవించి ఉన్నంతకాలం పులివెందులకు సంబంధించిన ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అనునిత్యం దాన, ధర్మాలలో మునిగిపోయేవారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం కావాలన్న చిరకాల వాంఛ నెరవేరిన తర్వాత 2006 జనవరి 25వ తేదీన ఆమె తుదిశ్వాస వదిలారు.


అంతకుమునుపు 2003లో వైఎస్‌ఆర్‌ ప్రజల కష్టసుఖాలను తెలుసుకొనేందుకు పాదయాత్ర చేసిన సందర్భంలో తల్లిగా వైఎస్‌ జయమ్మ కుమిలిపోతూనే.. బిడ్డకు మంచి జరగాలని ప్రతిరోజు ప్రారి్థంచేవారు. అంతేకాదు 1999 ప్రాంతంలో విపరీతమైన కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు అప్పటి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు ఐదారు వందల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని కలి్పంచి ప్రశంసలు అందుకున్నారు. 1995నుంచి 2000 వరకు పులివెందుల సర్పంచ్‌గా పనిచేసిన వైఎస్‌ జయమ్మ అప్పటి ప్రభుత్వం నుంచి ఉత్తమ సర్పంచ్‌ అవార్డుతోపాటు  పంచాయతీని ఆదర్శంగా నిలిపి ఉత్తమ పంచాయతీ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. వైఎస్‌ జయమ్మ జీవించినంత కాలం ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తూ పులివెందుల అమ్మగా గుర్తింపు పొందారు. ఆమె మరణించి నేటికి సరిగ్గా 15ఏళ్లు అవుతోంది.

 
నేడు వైఎస్‌ జయమ్మ వర్ధంతి  
దివంగత వైఎస్‌ రాజారెడ్డి సతీమణి వైఎస్‌ జయమ్మ 15వ వర్ధంతిని సోమవారం పులివెందులలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. వైఎస్‌ జయమ్మ సమాధి వద్ద ప్రార్థనలతోపాటు జయమ్మ పార్క్‌లోని విగ్రహం వద్ద పలువురు వైఎస్‌ కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి, మాజీ ఎమ్మెల్యే వైఎస్‌ విజయమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళులరి్పంచనున్నారు. వైఎస్‌ కుటుంబ సభ్యులతోపాటు పలువురు వైఎస్‌ఆర్‌ అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.


     
      

మరిన్ని వార్తలు