‘సీఎం జగన్ ఆలోచన ఓ కలికితురాయి’

26 Oct, 2020 19:30 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం ప్రారంభించడం ఆనందదాయకమని వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. ఈ అవకాశాన్ని దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎం కావడం దళితుల అదృష్టమని అన్నారు. ఆయన లాంటి ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఆశించిన మార్పును సీఎం జగన్‌ ఆచరిస్తున్నారని ప్రశంసించారు. ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా ఉండకూడదని, పెద్ద పారిశ్రామిక వేత్తలగా చూడాలని సీఎం అనడం తమకు చాలా గర్వంగా ఉందన్నారు. చదవండి: రైతులకు శుభవార్త: రూ. 113.11 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ

‘ఎస్సీ, ఎస్టీల ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం జగనన్న వైఎస్సార్‌‌ బడుగు వికాసానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోకూడదనే ఈ నిర్ణయం. ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. ఈ రోజు మేము ధైర్యంగా ప్రరిశ్రమల స్థాపనలో ముందుకువెళతాము. స్కిల్ డెవలప్‌మెంట్‌తో ఎన్నో సౌకర్యాలు దీనిలో ఉన్నాయి. మొత్తం రాయతీలతో, ఇండస్ట్రీయల్ పార్క్‌లో మాకు ప్రత్యేక కేటాయింపులు చేయడం శుభపరిణామం. అందుకే మేమంతా ముఖ్యమంత్రిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాజకీయ వ్యవస్థలో జగన్ ఆలోచన ఓ కలికితురాయి. రాజకీయాల్లో దళితులను దూరంగా పెట్టిన వారు ఇప్పుడు మళ్లీ వారిని మోసం చేసేందుకు వస్తున్నారు. సాయం చేయడం చేతకాని వారు సంక్షేమ పథకాలు దళితులకు అందకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు.’ అని మ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. చదవండి: ఏపీ: మద్యం ప్రియులకు మరో షాక్‌

పండుగ రోజు సీఎం వైఎస్‌ జగన్‌ దళితులకు నిజంగా ఓ వరం ఇచ్చారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపపారు. అదే విధంగా ‘ఇదొక శుభపరిణామం. ఈ పాలసీని చూస్తే దళితులకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో ఎస్సీ, ఎస్టీల ఇంసెంటివ్‌లు బకాయిలు పెట్టిన ఘనత చంద్రబాబుది. ఆ 1100 కోట్ల బకాయిలను చెల్లించిన ఘనత జగన్‌ది. జగన్ వల్ల మా బతుకులు మారతాయని భావించిన వారి నమ్మకం నిజమైంది. ఏ ఒక్కరి నమ్మకాన్ని సీఎం జగన్ వమ్ము కానివ్వరు.’ అని పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. 

మరిన్ని వార్తలు