శిరోముండనం : దోషులకు కఠిన శిక్ష

30 Aug, 2020 17:01 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : శిరోముండనం ఘటన బాధితుడైన దళిత యువకుడికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో అరాచకాలకు అవకాశం లేదని, ఇలాంటి ఘటనలు జరగడం దుదరృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. సీసీ ఫుటేజీ చూస్తే ఆ యువకుడిపై ఎంత అహంకారంతో ప్రవర్తించారో అర్ధమవుతుందన్నారు. ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారని తెలిపారు. నూతన్‌నాయుడు భార్యతోపాటు ఏడుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారని, శిరోముండనం ఘటనపై టీడీపీ నేతలు నోరుమెదపడలేదని ప్రశ్నించారు. (నీతిలేని ‘నూతన్’‌)

నూతన్‌నాయుడు భార్యతోపాటు ఏడుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారని, శిరోముండనం ఘటనపై టీడీపీ నేతలు నోరుమెదపడలేదని ప్రశ్నించారు. నూతన్‌నాయుడితో టీడీపీ నేతలకు సంబంధాలున్నాయని, జనసేనకూ సన్నిహితుడు అన్నారు. ఈ ఘటనలో దోషులకు కఠినశిక్ష తప్పదు ఎమ్మెల్యే హెచ్చరించారు. మరోవైపు శిరోముండనం ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి  ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. (శ్రీకాంత్‌కు మంత్రి అవంతి పరామర్శ)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు