చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి | Sakshi
Sakshi News home page

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

Published Sat, Oct 14 2023 5:00 AM

-

మొయినాబాద్‌: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అడిషనల్‌ సెక్రటరీ పార్వతీదేవి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు గురుకుల పాఠశాల ఆవరణలో నాలుగు రోజులపాటు నిర్వహించే గురుకులాల జోనల్‌ స్థాయి క్రీడా పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 11 బాలుర గురుకులాల నుంచి 955 మంది విద్యార్థులు పాల్గొంటున్న క్రీడా పోటీలను ఆమె బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే క్రీడా స్ఫూర్తిని నిపేందుకు గురుకులాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గురుకులాల ప్రాంతీయ సమన్వయాధికారి శారద, భాస్క ర ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాంచందర్‌రావు, ప్రాంతీయ క్రీడాధికారి ఉదయభాస్కర్‌, ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ, ఫిజికల్‌ డైరెక్టర్‌ ఆదిబాబు, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

గురుకుల విద్యాలయాల సంస్థ

అడిషనల్‌ సెక్రటరీ పార్వతీదేవి

Advertisement
Advertisement