ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది

3 Aug, 2021 06:23 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి బ.దశమి ప.12.10 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం రోహిణి రా.1.51 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం సా.4.57 నుండి 6.43 వరకు, దుర్ముహూర్తం ఉ. 8.14 నుండి 9.06 వరకు తదుపరి రా.10.56 నుండి 11.44 వరకు, అమృతఘడియలు... రా.10.16 నుండి 12.02 వరకు.

సూర్యోదయం :    5.42
సూర్యాస్తమయం    :  6.29
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

మేషం: అప్పులు చేయాల్సివస్తుంది. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. నూతన విద్యావకాశాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

మిథునం: ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహం..

కర్కాటకం: నిరుద్యోగుల కృషి ఫలించదు. పనులలో అవరోధాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆస్తి వివాదాలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

సింహం: చేపట్టిన పనులలో విజయం. శుభవర్తమానాలు. ఆదాయం పెరుగుతుంది. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. సోదరుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: సోదరులతో విభేదాలు. ముఖ్యమైన కార్యక్రమాలు రద్దు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు. దైవదర్శనాలు.

తుల: పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. ఆస్తి వివాదాలు. మానసిక అశాంతి. ధనవ్యయం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృశ్చికం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. వాహనయోగం.

ధనుస్సు: కొత్త ఉద్యోగ లాభం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. సోదరులతో సఖ్యత. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. 

మకరం: పనులు మధ్యలో విరమిస్తారు. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో ఆటుపోట్లు.

కుంభం: మిత్రులతో  విభేదాలు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

మీనం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
  

మరిన్ని వార్తలు