గ్రహం అనుగ్రహం (06-12-2020) 

6 Dec, 2020 06:14 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.షష్ఠి సా.4.20 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం ఆశ్లేష ప.12.26 వరకు, తదుపరి మఖ, వర్జ్యం రా.12.10 నుంచి 1.42 వరకు
దుర్ముహూర్తం సా.3.53 నుంచి 4.35 వరకు, అమృతఘడియలు... ఉ.10.48 నుంచి 12.23 వరకు.

సూర్యోదయం        :  6.20
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు
 

మేషం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాభావంతో ముందుకు సాగుతారు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మిథునం: పరిస్థితుల ప్రభావంతో ఇబ్బంది పడతారు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం: వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు. ధన,వస్తులాభాలు. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

సింహం: పనులు మధ్యలో విరమిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కన్య: కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృశ్చికం: ప్రయాణాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

ధనుస్సు: కొత్త రుణయత్నాలు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మకరం: దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. కొత్త విషయాలు తెలుస్తాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. 

మీనం: వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మరిన్ని వార్తలు