ఈ రాశివారికి ఆకస్మిక ప్రయాణాలు

25 Feb, 2021 06:06 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి శు.త్రయోదశి ప.3.46 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం పుష్యమి ప.12.01 వరకు తదుపరి ఆశ్లేష, వర్జ్యం రా.12.54 నుంచి 2.28 వరకు దుర్ముహూర్తం ఉ.10.17 నుంచి 11.03 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు, అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం :    6.26
సూర్యాస్తమయం    :  6.01
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలు గుర్తింపులోకి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

మిథునం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం: ఆర్థికంగా బలం చేకూరుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు డీలాపడతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కన్య: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగయోగం. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

తుల: వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

ధనుస్సు: అవసరాలకు రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మకరం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సమాజంలో గౌరవం. వాహనసౌఖ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషులు సహకరిస్తారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
 

మరిన్ని వార్తలు