ఈ రాశివారికి పరపతి పెరుగుతుంది

26 Mar, 2021 06:20 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి శు.త్రయోదశి తె.4.18 వరకు (తెల్లవారితే శనివారం) తదుపరి చతుర్దశి, నక్షత్రం మఖ రా.7.34 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం ఉ.7.40 నుంచి 9.20 వరకు, తిరిగి రా.3.23 నుంచి 4.55 వరకు దుర్ముహూర్తం ఉ.8.27 నుంచి 9.15 వరకు, తదుపరి ప.12.28 నుంచి 1.18 వరకు, అమృతఘడియలు... సా.5.10 నుంచి 6.45 వరకు.

సూర్యోదయం :    6.03
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

దినఫలాలు:
మేషం... ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు , ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

వృషభం... ఆర్థిక విషయాలలో గందరగోళం. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మిథునం... రాబడి ఉత్సాహాన్నిస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

కర్కాటకం... మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

సింహం... సోదరుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చాగోష్ఠులలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కన్య... వ్యవహారాలలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. దైవదర్శనాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.

తుల... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. సన్నిహితులతో సఖ్యత. భూలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

వృశ్చికం... ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలయ దర్శనాలు. ఆకస్మిక ధనలబ్ధి. ఆహ్వానాలు  రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలు చిక్కులు వీడతాయి.

ధనుస్సు... దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. కొన్ని పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

మకరం... ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం... సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. పరపతి పెరుగుతుంది. ధనలబ్ధి. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మీనం... ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విచిత్ర సంఘటనలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

మరిన్ని వార్తలు