ఈ రాశివారికి బంధువులతో తగాదాలు

27 Mar, 2021 06:38 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి శు.చతుర్దశి రా.2.51 వరకు తదుపరి పౌర్ణమి, నక్షత్రం పుబ్బ సా.6.58 వరకు తదుపరి ఉత్తర, వర్జ్యం రా. 1.55 నుంచి 3.24 వరకు దుర్ముహూర్తం ఉ.6.03 నుంచి 7.38 వరకు అమృతఘడియలు... ప.12.43 నుంచి 2.15 వరకు.


సూర్యోదయం :    6.02
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

రాశి ఫలాలు

మేషం: వ్యయప్రయాసలు. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభం: మిత్రులే శత్రువులుగా మారతారు. శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మరింత సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: వ్యవహారాలలో విజయం. భూములు కొంటారు. కొన్ని వివాదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

కర్కాటకం: పనులు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం: సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య:వ్యవహారాలలో అవరోధాలు. రుణయత్నాలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆర్థిక విషయాలలో నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తులు దక్కుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

ధనుస్సు: కొన్ని సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మకరం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు తప్పదు.

కుంభం: పొరపాట్లు సరిదిద్దుకుని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.
 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు