ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు

5 May, 2021 06:25 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.నవమి సా.5.12 వరకు, తదుపరి దశమి, నక్షత్రం ధనిష్ఠ ప.1.04 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం రా.8.23 నుంచి 10.01 వరకు, దుర్ముహూర్తం ప.11.31 నుంచి 12.20 వరకు, అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం :    5.36
సూర్యాస్తమయం    :  6.16
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు:

మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభ వార్తా శ్రవణం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పోటీపరీక్షల్లో విజయం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. 

వృషభం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. 

మిథునం: మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అంతగా అనుకూలించదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. 

కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. 

సింహం: దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. 

కన్య: నూతన ఉద్యోగయోగం. చర్చలు సఫలం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. 

తుల: మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన. 

వృశ్చికం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. విద్యార్థులకు చికాకులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

ధనుస్సు: మిత్రుల చేయూతతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి.

మకరం: ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి. రుణయత్నాలు. బంధువర్గంతో మాటపట్టింపులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. 

కుంభం: పనుల్లో పురోగతి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఆస్తిలాభ సూచనలు. 

మీనం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఆస్తి వివాదాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవచింతన. 
 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు