ఈ రాశి వారికి ముఖ్యమైన పనుల్లో విజయం, ఆస్తి లాభం

5 Nov, 2023 06:49 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: అష్టమి రా.3.17 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: పుష్యమి ఉ.11.45 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.1.51 నుండి 3.34 వరకు, దుర్ముహూర్తం: సా.3.54 నుండి 4.37వరకు,
అమృతఘడియలు: లేవు;
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు,
యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు,
సూర్యోదయం: 6.04,
సూర్యాస్తమయం: 5.25. 

మేషం: ముఖ్య పనులు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యపరంగా చికాకులు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు.

వృషభం: విద్యార్థులు సత్తా నిరూపించుకుంటారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత. 

మిథునం: కుటుంబసభ్యులతో వైరం. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన.

కర్కాటకం: నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.

సింహం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య: ముఖ్యమైన పనులలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. వాహన, గృహయోగాలు. నూతన ఉద్యోగలాభం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

తుల: వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

వృశ్చికం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్య సూచనలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనస్సు: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు.

మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

మీనం: రుణాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. నూతన ఒప్పందాలు. చర్చలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

మరిన్ని వార్తలు