ఈ రాశి వారికి అన్నింటా విజయం, వస్తులాభం

27 May, 2023 06:49 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.అష్టమి పూర్తి (24గంటలు), నక్షత్రం: మఖ రా.9.54 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ఉ.8.15 నుండి 10.03 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.28 నుండి 7.11 వరకు, అమృతఘడియలు: సా.6.54 నుండి 7.34 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.29, సూర్యాస్తమయం: 6.24. 

మేషం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం: కుటుంబంలో చికాకులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు.

మిథునం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కర్కాటకం: రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో విరోధాలు. ఆలోచనలు కలసిరావు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని అవాంతరాలు.

సింహం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. దైవదర్శనాలు. వృత్తి,వ్యాపారాలలో కొత్త ఆశలు.

కన్య: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటిలో సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

తుల: శుభవార్తలు అందుతాయి. కార్యజయం. కొన్ని సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

వృశ్చికం: అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

ధనుస్సు: రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: వ్యయప్రయాసలు. మిత్రులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడులు. రాబడికి మించి ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

కుంభం: ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీనం: ఉద్యోగయత్నాలు సానుకూలం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.

మరిన్ని వార్తలు