Today Horoscope Telugu: ఈ రాశి వారికి అన్నింటా విజయమే, హైస్పీడ్‌లో పనులు పూర్తి

10 Feb, 2023 06:53 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.పంచమి తె.5.48 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి షష్ఠి, నక్షత్రం: హస్త రా.9.44 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం తె.5.59 నుండి 7.36 వరకు (తెల్లవారితే శనివారం), దుర్ముహూర్తం: ఉ.8.50 నుండి 9.34 వరకు, తదుపరి ప.12.35 నుండి 1.22 వరకు, అమృతఘడియలు: ప.3.23 నుండి 5.04 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.35, సూర్యాస్తమయం: 5.54 

మేషం: వ్యయప్రయాసలు తగ్గుతాయి. ఆప్తుల నుండి ముఖ్య విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల పరిచయం. ఆస్తిలాభం. వ్యాపార, ఉద్యోగాలు అనూహ్యంగా మెరుగుపడతాయి.

వృషభం: సన్నిహితులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణభారాలు. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యగాలు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు.

కర్కాటకం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

సింహం: కొన్ని విషయాలలో పొరపాట్లు దొర్లుతాయి. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. సోదరులతో కలహాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. 

కన్య: మీ నైపుణ్యం చాటుకుంటారు. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: వ్యవహారాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు రావచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు: స్థిరాస్తి వృద్ధి. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. వ్యాపార, విస్తరణ ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తులకు హోదాలు.

మకరం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. మీ ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు కలిసిరావు.

కుంభం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితిలో తేడాలు వచ్చి రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మీనం: కొన్ని విషయాలలో ముందడుగు వేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

మరిన్ని వార్తలు