Today Horoscope: ఈ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి

15 Jun, 2022 06:23 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి బ.పాడ్యమి ప.3.20 వరకు, తదుపరి విదియనక్షత్రం మూల సా.5.50 వరకు, తదుపరి పూర్వాషాఢ వర్జ్యం సా.4.21 నుండి 5.50 వరకు, తిరిగి రా.2.44 నుండి 4.13 వరకు, దుర్ముహూర్తం ప.11.34 నుండి 1.21 వరకు అమృతఘడియలు... ఉ.11.50 నుండి 1.20 వరకు.

సూర్యోదయం :    5.29
సూర్యాస్తమయం    :  6.31
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం...అనుకోని ఖర్చులు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. ఉద్యోగాలలో మార్పులు.  వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. బంధువిరోధాలు.

వృషభం....కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలలో ఆటంకాలు. భూవివాదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. శ్రమ తప్పదు. కళాకారులకు కొంత గందరగోళంగా ఉంటుంది.

మిథునం...వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో   ప్రశంసలు. కళాకారులకు సన్మానాలు. ఆకస్మిక «దనలాభం. సోదరుల కలయిక. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన.

కర్కాటకం.....కొత్త పనులు చేపడతారు. కాంట్రాక్టులు పొందుతారు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆస్తిలాభం. బంధువుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

సింహం...పనులు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు.  ఆరోగ్యభంగం.. మానసిక అశాంతి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.  ఉద్యోగాలలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. 

కన్య......అనుకోని ధనవ్యయం. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు. బంధవులతో తగదాలు. 

తుల......దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ముందడుగు.

వృశ్చికం......ఆర్థిక ఇబ్బందులు. విద్యార్థుల కృషి ఫలించదు. పనుల్లో ఆటంకాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగాలలో ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.

ధనుస్సు...కుటుంబంలో శుభకార్యాలు. ధనలాభం.  సన్నిహితుల నుంచి సహాయం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. వ్యాపారాలు పుంజుకుంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

మకరం....వ్యవహారాలలో ఆటంకాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు.వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు.

కుంభం....పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి. వస్తులాభాలు.

మీనం..... శుభకార్యాలు. ధనలాభం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

మరిన్ని వార్తలు