నేటి దిన ఫలాలు: ఈ రాశి వారికి ధనలాభం, విందువినోదాల్లో పాల్గొంటారు

22 Sep, 2022 06:45 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.ద్వాదశి రా.12.09 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: ఆశ్లేష రా.2.11 వరకు, తదుపరి మఖ వర్జ్యం: ప.1.54 నుండి 3.41 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.54 నుండి 10.42 వరకు, తదుపరి ప.2.43 నుండి 3.32 వరకు అమృతఘడియలు: రా.12.26 నుండి 2.11 వరకు.

సూర్యోదయం :    5.52
సూర్యాస్తమయం    :  5.56
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: కుటుంబసభ్యులతో వైరం. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన.

వృషభం: విద్యార్థులు సత్తా నిరూపించుకుంటారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మిథునం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్య సూచనలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం: రుణాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. నూతన ఒప్పందాలు. చర్చలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

సింహం: ముఖ్య పనులు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యపరంగా చికాకులు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు.

కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

ధనుస్సు: ప్రయాణాలు వాయిదా వేస్తారు. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మకరం: ముఖ్యమైన పనులలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. వాహన, గృహయోగాలు. నూతన ఉద్యోగలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ఉన్నతి.

కుంభం: నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.

మీనం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు.

మరిన్ని వార్తలు