Today Horoscope: ఈ రాశివారికి ఆత్మీయుల నుంచి శుభవార్తలు.. ఆర్థిక ప్రగతి

26 Nov, 2022 06:41 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి:  శు.తదియ రా.10.51 వరకు, తదుపరి చవితి నక్షత్రం: మూల సా.6.38 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: సా.5.10 నుండి 6.40 వరకు, తిరిగి తె.3.37 నుండి 5.04 వరకు (తెల్లవారితే ఆదివారం), దుర్ముహూర్తం: ఉ.6.15 నుండి 7.43 వరకు అమృతఘడియలు: ప.12.35 నుండి 1.42 వరకు.

సూర్యోదయం :    6.14
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిర ంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. పనులలో ఆటంకాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  కొద్దిపాటి చికాకులు.

వృషభం: రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో చికాకులు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

మిథునం: కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుస్తాయి. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కర్కాటకం: యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి . ఆహ్వానాలు అందుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహం: బంధువులతో అకారణంగా తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది.

కన్య: పనులు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు అంతంతగా అనుకూలించవు. ఆస్తి వివాదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యంగా ఉంటుంది.

తుల: శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం: ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఆస్తి వివాదాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు నెలకొంటాయి.

ధనుస్సు: పాతబాకీలు వసూలవుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. సంఘంలో ఆదరణ. మిత్రుల నుంచి సహాయం. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

మకరం: వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

కుంభం: పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో చికాకులు అధిగమిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు.

మీనం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మరిన్ని వార్తలు