ఈ రాశివారు శుభవార్తలు వింటారు

30 Apr, 2022 06:20 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి అమావాస్య రా.1.11 వరకు తదుపరి వైశాఖ శు.పాడ్యమి, నక్షత్రం అశ్వని రా.7.46 వరకు తదుపరి భరణి, వర్జ్యం ప.3.36 నుండి 5.16 వరకు దుర్ముహూర్తం ఉ.5.40 నుండి 7.20 వరకు అమృతఘడియలు... ప.12.16 నుండి 1.56 వరకు. 

సూర్యోదయం :    5.39
సూర్యాస్తమయం    :  6.14
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

రాశిఫలాలు..

మేషం: బంధువులతో సఖ్యత. విందువినోదాలు. భూవివాదాల నుంచి బయటపడతారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగులకు కొన్ని చికాకులు తొలగుతాయి. 

వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. మానసిక అశాంతి. అనారోగ్యం. పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. 

మిథునం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఉద్యోగయత్నాలలో అనుకూలత. విందువినోదాలు. కార్యజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. 

కర్కాటకం: బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వస్తు,వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. 

సింహం: ప్రయాణాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. బంధువర్గంతో  తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

కన్య: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. 

తుల: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు అనుకోని విధంగా పదోన్నతులు.

వృశ్చికం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. సోదరుల నుంచి సహాయం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. 

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. 

మకరం: అనుకోని ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపార విస్తరణలో అవరోధాలు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. 

కుంభం: బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. వాహన, గృహయోగాలు. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మీనం: కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు శ్రమాధిక్యం. 
 

మరిన్ని వార్తలు