ఈ రాశివారికి నూతన ఉద్యోగాలు.. ఆత్మీయుల నుంచి శుభవార్తలు

31 Oct, 2022 07:01 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.సప్తమి రా.3.27 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పూర్వాషాఢ ఉ.8.54 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: సా.4.18 నుండి 5.47 వరకు, దుర్ముహూర్తం: ప.12.05 నుండి 12.53 వరకు, తదుపరి ప.2.25 నుండి 3.11 వరకు, అమృతఘడియలు: రా.1.12 నుండి 3.01 వరకు; రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు; సూర్యోదయం 6.01; సూర్యాస్తమయం 5.27. 

మేషం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. దైవచింతన. వాహనయోగం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.

వృషభం: పనులలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు భారంగా మారతాయి.

మిథునం: సన్నిహితులు,స్నేహితులతో వైరం. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కర్కాటకం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

సింహం: కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. భూముల కొనుగోలు యత్నాలు సఫలం. విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కన్య: బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ధనవ్యయం. పనులు వాయిదా పడతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

తుల: వివాదాలకు దూరంగా ఉండండి. పనుల్లో ప్రతిష్ఠంభన. సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు.  ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం: నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కొన్ని వివాదాలు తీరతాయి. సోదరుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

మకరం: యత్నకార్యసిద్ధి. ముఖ్యమైన పనులలో విజయం. ఆప్తుల సూచనలు పాటిస్తారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

కుంభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి.

మీనం: ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు