ఈ రాశివారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది

3 Nov, 2021 06:15 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్‌:

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి బ.త్రయోదశి ఉ.7.10 వరకు తదుపరి చతుర్దశి తె.5.23 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం హస్త ఉ.9.09 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం సా.4.47 నుండి 6.20 వరకు, దుర్ముహూర్తం ప.11.20 నుండి 12.07 వరకు అమృతఘడియలు... రా.1.59 నుండి 2.34 వరకు, నరక చతుర్దశి.

సూర్యోదయం :    6.03
సూర్యాస్తమయం    :  5.26
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: కొత్త విషయాలు తెలుస్తాయి. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిదానం అవసరం.

మిథునం: బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు చేసుకుంటారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.

కర్కాటకం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. సమాజసేవలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తీరతాయి.

సింహం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కన్య: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశలు ఫలిస్తాయి.

తుల: కొన్ని సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కీలక మార్పులు.

ధనుస్సు: నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యవహారాలలో విజయం. ధనలాభం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

మకరం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులతో వివాదాలు. ఆస్తుల కొనుగోలులో జాప్యం. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: నూతన పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మరిన్ని వార్తలు