ఈ రాశివారికి మిత్రులతో అకారణంగా విభేదాలు

23 Aug, 2021 06:25 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి బ.పాడ్యమి సా.4.35 వరకు, తదుపరి విదియ, నక్షత్రం శతభిషం రా.8.37 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం తె.3.11 నుండి 4.47 వరకు(తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం ప.12.27 నుండి 1.19 వరకు, తదుపరి ప.2.59 నుండి 3.48 వరకు,  అమృతఘడియలు... ప.1.23 నుండి 3.01 వరకు.

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం    :  6.19
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు

 

 రాశి ఫలాలు:

మేషం.. ప్రముఖులతో పరిచయాలు. ఆసక్తికర సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం.. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. దైవదర్శనాలు. వ్యవహారాలలో విజయం.  సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం.. ప్రయాణాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

కర్కాటకం.. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

సింహం.. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. బాకీలు వసూలవుతాయి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముఖ్య మార్పులు.

కన్య.. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

తుల.. వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృశ్చికం.. రుణాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

ధనుస్సు.. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు.

మకరం.. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

కుంభం.. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. బంధువులను కలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో ఉంటాయి.

మీనం.. పనుల్లో జాప్యం. ఆదాయానికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తప్పవు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు