ఈ రాశివారికి ఆత్మీయుల నుంచి కీలక సమాచారం

28 Aug, 2021 06:28 IST|Sakshi

శ్రీ ప్లవనామ సంవత్సరం,దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం తిథి బ.షష్ఠి రా.8.07 వరకు,తదుపరి సప్తమి, నక్షత్రం భరణి రా.3.54 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం ప.12.06 నుండి 1.53 వరకు, దుర్ముహూర్తం ఉ.5.47 నుండి 7.28 వరకు అమృతఘడియలు...రా.10.34 నుండి 12.21 వరకు

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం    :  6.16
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

రాశి ఫలాలు:
మేషం..  ఆకస్మిక ప్రయాణాలు. కొత్తరుణయత్నాలు. బంధువులు, మిత్రుల నుంచి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలిసిరావు.

వృషభం..  కొత్త విషయాలు గ్రహిస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తు, ధనలాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

మిథునం... వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. దూరపు బంధువుల కలయిక. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటకం...  పరిచయాలు విస్తృతమవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

సింహం...  కొత్త పనులు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

కన్య...  రుణాలు చేయాల్సిన పరిస్థితులు. పనులలో అవాంతరాలు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. మీ ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల...  పనులు ముందుకు సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆస్తుల కొనుగోలులో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృశ్చికం... పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో ఆదరణ. వాహనయోగం. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

ధనుస్సు... నూతన విద్యావకాశాలు పొందుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో కొన్ని వేడుకల నిర్వహణ. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ మాటే చెల్లుబాటు కాగలదు.

మకరం...  పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమకు ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందగోళపరుస్తాయి.

కుంభం...  రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. సోదరులతో విభేదాలు. భూవివాదాలు. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

మీనం... పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. బంధువులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు