ఈ రాశివారికి వారం ప్రారంభంలో అనారోగ్యం

13 Jun, 2021 06:12 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
స్నేహితులతో సఖ్యత నెలకొంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి కాగలవు. ప్రముఖ వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని వేడుకల్లో  పాల్గొంటారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందుకు సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఉన్నతస్థితి దక్కే అవకాశం. కళారంగం వారికి అవకాశాలు మరింత పెరుగుతాయి. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. మానసిక అశాంతి. గులాబీ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఆదాయం అంతగా కనిపించదు. కొత్తగా అప్పులు చేస్తారు. కుటుంబసమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. బంధువులతో ఆస్తి వివాదాలు నెలకొంటాయి. నిరుద్యోగుల యుత్నాలు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలలో నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు అంచనాలు తప్పుతాయి. వారం మధ్యలో శుభవర్తమానాలు. ధనలబ్ధి. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. 

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. ఆస్తుల  వివాదాలు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ  ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు దక్కుతాయి. కోర్టు వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. కొన్ని పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగ విధుల్లో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనసౌఖ్యం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.  కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆదాయం అనుకున్నంతగా  పెరుగుతుంది. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి. ఇంటి  నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలలో పెట్టుబడులతో పాటు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమర్థతను అందరూ ప్రశంసిస్తారు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. అందరిలోనూ ప్రత్యేకతను నిలుపుకుంటారు. భూములు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. కొన్ని సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడతారు. వ్యాపారాలలో సమస్యలు తీరి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాల యత్నాలు సఫలం. కళారంగం వారికి అవకాశాలు మరింత పెరుగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం.  ఆరోగ్యసమస్యలు. ఆప్తులతో మాటపట్టింపులు. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక లావాదేవీలు మొదట్లో ఇబ్బందిగా ఉన్నా క్రమేపీ అధిగమిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. నూతన విద్యావకాశాలు దక్కవచ్చు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గవచ్చు. రాజకీయవర్గాల యత్నాలు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని సమస్యలను క్రమేపీ పరిష్కరించుకుంటారు. అనుకున్న పనులు కొంత నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కవచ్చు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో వివాదాల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వైరం. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. రుణ బాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. పరపతి మరింత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ప్రోత్సాహం అందుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగాన్వేషణలో విజయం. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు వివాదాలు పరిష్కారమవుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు 

మరిన్ని వార్తలు