రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ బోనస్!

6 Oct, 2021 20:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ శుభవార్త తెలిపింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాలకు సమానమైన బోనస్ అందించేందుకు కేంద్ర మంత్రివర్గం నేడు ఆమోదం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఖజానా మీద ₹1,984.73 కోట్లు ఆర్ధిక భారం పడనుంది. సుమారు 11.56 లక్షల నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది.

"అర్హత కలిగిన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరికీ(ఆర్‌పిఎఫ్‌/ఆర్‌పిఎస్ఎఫ్ సిబ్బంది మిన‌హా) 2020-21 ఆర్థిక సంవత్సరానికి 78 రోజుల వేతనాలకు సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(పిఎల్‌బి)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది" అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన రైల్వే ఉద్యోగులకు బోనస్ కింద 78 రోజులకు చెల్లించాల్సిన మొత్తం ₹17,951 అని కేంద్రం పేర్కొంది. అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పిఎల్‌బి చెల్లించడానికి సూచించిన వేతన లెక్కింపు పరిమితి ₹7,000/నెలకు అని తెలిపింది. (చదవండి: టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్‌...!)

"అర్హత కలిగిన రైల్వే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం దసరా సెలవులకు ముందు పిఎల్‌బి చెల్లింపు చేయబడుతుంది. ఈ ఏడాది కూడా సెలవులకు ముందే మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు"  కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వాస్తవానికి ఫార్ములాను బట్టి 72 రోజుల వేతనాన్ని బోనస్ గా ఇవ్వాలి. కానీ ప్రధాని మోదీ, కేబినెట్ 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా అందించి వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఈ నిర్ణయం తీసుకుంది.

(చదవండి: టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్‌...!)

మరిన్ని వార్తలు