ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అద్భుతాలు చేస్తున్న 11ఏళ్ల బాలిక!

27 Mar, 2023 17:33 IST|Sakshi

ఆర్టీఫీషియ్‌ల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో కేరళకు చెందిన 11 ఏళ్ల బాలిక అద్భుతాలు సృష్టిస్తోంది. 10 ఏళ్ల వయసులో Ogler EyeScan అనే ఏఐ యాప్‌ను డిజైన్‌ చేసింది. ఐఫోన్‌ను ఉపయోగించి ఆ యాప్‌ ద్వారా కంటి సమస్యల్ని గుర్తిస్తుంది. ప్రస్తుతం ఆమె తయారు చేసిన ఏఐ అప్లికేషన్‌ చర్చాంశనీయంగా మారింది.  

కేరళకు చెందిన 11ఏళ్ల లీనా రఫీక్‌ (Leena Rafeeq) తయారు చేసిన ఏఐ అప్లికేషన్‌ గురించి లింక్డ్ ఇన్‌లో వివరించారు. ఆ పోస్ట్‌లో..రకరకాల పద్దతుల్లో అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్‌ విజన్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌తో కంటికి సంబంధించిన వెలుతురు, రంగు, దూరాన్ని కొలిచే సామర్ధ్యం ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు స్కానర్‌ ఫ్రేమ్‌తో కంటి వెలుతురు సమస్యల్ని గుర్తించవచ్చని అన్నారు. 

స్కాన్ తగిన విధంగా తీసుకున్న తర్వాత కంటి వ్యాధులు ఆర్కస్, మెలనోమా, పేటరీజియం, కంటిశుక్లం వంటి సమస్యల్ని నిర్ధారించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా రఫీక్ మాట్లాడుతూ.. థర్డ్ పార్టీ లైబ్రరీలు, ప్యాకేజీలు లేకుండా యాపిల్‌కు చెందిన స్విఫ్ట్‌యుఐ (SwiftUI) ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌తో ఆరునెలల పాటు శ్రమించి ఈ యాప్‌కు జీవం పోసినట్లు తెలిపారు. అయితే, Ogler EyeScan ఐఫోన్ 10, అంతకంటే ఎక్కువ iOS 16+తో మాత్రమే సపోర్ట్ చేస్తుందని చెప్పారు. కాగా రఫీక్‌ చేసిన అప్లికేషన్‌ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇలాంటి యాప్స్‌ను తయారు చేయడం అద్భుతమని కొనియాడుతున్నారు.

చదవండి👉 సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ ఖాతాదారులకు భారీ ఊరట! 

మరిన్ని వార్తలు