5 కంపెనీలు..రూ.1.53 లక్షల కోట్ల పెట్టుబడులు,1.35ల‌క్ష‌ల ఉద్యోగాలు!!

20 Feb, 2022 21:13 IST|Sakshi

మ‌న‌దేశంలో 1.53 ట్రిలియన్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్ చిప్, డిస్‌ప్లే తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఐదు కంపెనీల నుండి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయని కేంద్రం తెలిపింది. 

వేదాంత ఫాక్స్‌కాన్ జేవీ, ఐజీఎస్ఎస్‌ వెంచర్స్, ఐఎస్ఎంసీలు 13.6 బిలియన్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్ చిప్ తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. రూ.76,000 కోట్ల సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ కింద కేంద్రం నుండి 5.6 బిలియన్ల సహాయాన్ని కోరిన‌ట్లు కేంద్రం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌నలో పేర్కొంది. 

"నెలకు దాదాపు 120,000 వేఫర్‌ల సామర్థ్యంతో 28 నానోమీటర్ (ఎన్ఎమ్) నుండి 65 ఎన్ఎమ్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లను ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు అందాయ‌ని తెలిపిన కేంద్రం..28 ఎన్ఎమ్‌ నుండి 45 ఎన్ఎమ్‌ వరకు ఉన్న చిప్‌లకు 40 శాతం వరకు, 45 ఎన్ఎమ్‌ నుండి 65 ఎన్ఎమ్‌ వేఫర్‌ల కోసం తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి 30 శాతం వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న‌ట్లు హామీ ఇచ్చింది.  

కాగా మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటిలో ఉపయోగించే డిస్‌ప్లే తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని వేదాంత, ఎలెస్ట్ సంస్థ‌లు ప్రతిపాదించాయి. 6.7 బిలియన్ల అంచనా పెట్టుబడితో. భారత్‌లో డిస్‌ప్లే ఫ్యాబ్‌ల ఏర్పాటు కోసం కేంద్రం నుంచి 2.7 బిలియన్ డాలర్ల మద్దతు కోరినట్లు ఆ ప్రకటన తెలిపింది.

ఎలక్ట్రానిక్ చిప్,డిస్‌ప్లే ప్లాంట్లు కాకుండా 4 కంపెనీలు ఎస్‌పీఈఎల్‌ సెమీకండక్టర్,హెచ్‌సీఎల్‌, సిర్మా టెక్నాలజీ, వాలెంకని ఎలక్ట్రానిక్స్ సంస్థ‌లు సెమీకండక్టర్ ప్యాకేజింగ్ కోసం నమోదు చేసుకున్నాయి. రట్టోన్షా ఇంటర్నేషనల్ రెక్టిఫైయర్ సైతం సెమీకండక్టర్ల కోసం నమోదు చేసుకుంది.

మూడు కంపెనీలు టెర్మినస్ సర్క్యూట్స్, ట్రిస్పేస్ టెక్నాలజీస్, క్యూరీ మైక్రో ఎలక్ట్రానిక్స్ లు డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద దరఖాస్తులను సమర్పించాయి.  

కాగా, క్యాబినెట్ ఆమోదించిన సెమీకండక్టర్లకు ప్రోత్సాహక పథకం కింద వచ్చే నాలుగేళ్లలో దాదాపు రూ.1.7 ట్రిలియన్ల పెట్టుబడులు,1.35 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
 

మరిన్ని వార్తలు