బిర్లా ‘ఓపస్‌’ పెయింట్స్‌

15 Sep, 2023 00:33 IST|Sakshi

పెయింట్స్‌ విపణిలోకి గ్రాసిమ్‌ రూ.10,000 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పెయింట్స్‌ రంగంలోకి ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ అయిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ఎంట్రీ ఇచి్చంది. ఈ మేరకు ‘బిర్లా ఓపస్‌’ బ్రాండ్‌ను గురువారం ఆవిష్కరించింది. డెకోరేటివ్‌ పెయింట్ల వ్యాపారంలో గ్రాసిమ్‌ రూ.10,000 కోట్లు వెచ్చించనున్నట్టు వెల్లడించింది. 2024 జనవరి–మార్చి కాలంలో బిర్లా ఓపస్‌ ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయి.

గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ హరియణా, పంజాబ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో పెయింట్ల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 133.2 కోట్ల లీటర్లు. అధిక వృద్ధి ఉన్న విపణిలోకి ప్రవేశించడానికి కొత్త విభాగం వీలు కలి్పస్తుందని ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా ఈ సందర్భంగా అన్నారు. విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రెండేళ్లుగా బలమైన పునాదిని నిర్మించినట్టు చెప్పారు.

రాబోయే సంవత్సరాల్లో రెండవ స్థానంలో నిలిచి లాభదాయక కంపెనీగా ఎదగడానికి ప్రయతి్నస్తున్నామన్నారు. డెకోరేటివ్‌ పెయింట్స్‌ పరిశ్రమ భారత్‌లో రెండంకెల వృద్ధితో ఏటా రూ.70,000 కోట్లు నమోదు చేస్తోంది. 2022–23లో గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ 23 శాతం వృద్ధితో రూ.1.17 లక్షల కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయాన్ని ఆర్జించింది. కాగా, గ్రాసిమ్‌ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈలో గురువారం 0.12 శాతం క్షీణించి రూ.1,931.40 వద్ద స్థిరపడింది. 

మరిన్ని వార్తలు