ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్‌ పీ150: ధర ఎంతంటే?

23 Nov, 2022 15:23 IST|Sakshi

సాక్షి,ముంబై: బజాజ్‌ కంపెనీ  దేశీయ మర్కెట్లో సరి కొత్త పల్సర్‌ స్పోర్ట్స్‌  బైక్‌ను లాంచ్‌ చేసింది. యూత్‌ క్రేజ్‌కు అనుగుణంగా కొత్తగా అప్‌డేట్‌ చేసి స్పోర్టీ లుక్‌లో పల్సర్‌ పీ150  బైక్‌ను ఆవిష్కరించింది.  రేసింగ్ రెడ్‌, ఎబోనీ బ్లాక్‌ బ్లూ, ఎబోనీ బ్లాక్‌ వైట్‌, ఎబోనీ బ్లాక్‌ రెడ్‌, కరేబియన్‌ బ్లూ అనే  5 రంగుల్లో ఈబైక్‌ అందుబాటులోకి వచ్చింది. 

ధర:  సింగిల్‌-డిస్క్‌, సింగిల్‌ సీట్‌ కలిగిన బైక్‌ ధర రూ.1.16 లక్షలు (ఎక్స్-షోరూమ్)  అలాగే  ట్విన్‌-డిస్క్‌, స్లిట్‌ సీట్‌ మోడల్‌ ధరను రూ.1,19,757 ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది కంపెనీ.  

ఇంజీన్‌, ఫీచర్లు 
149 సీసీ సింగిల్‌ సిలిండర్ ఇంజన్  8500 ఆర్‌పీఎమ్‌ వదర్ద 14.5 హెచ్‌పీని, 13.5Nm టార్క్‌ను విడుదల చేస్తుంది  ఈ బైకులో యూఎస్‌బీ మొబైల్‌ చార్జింగ్‌ పోర్ట్‌, గేర్‌ ఇండికేటర్‌, సింగిల్‌ చానల్‌ ఏబీఎస్‌ బ్రేకింగ్‌ టెక్నాలజీ వంటి  అధునాతన ఫీచర్లను తోపాటు,స్ప్లిట్ గ్రాబ్ రైల్, క్లిప్-ఆన్ బార్‌లు చ స్ప్లిట్ సీట్ సెటప్ డ్యూయల్-డిస్క్ వెర్షన్‌తో  డిజైన్‌ మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దింది. వెనకాల సీట్ కాస్త హైట్‌ ఇచ్చి .  LED DRLలు ,  LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. ఇక  పోటీ  విషయానికి వస్తే బజాజ్ పల్సర్ P150 హోండా యునికార్న్, హోండా  ఎక్స్-బ్లేడ్ , సుజుకి జిక్సర్‌లకు  గట్టి పోటీ ఇవ్వనుంది. 

మరిన్ని వార్తలు