ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. వారు చేసే బిజినెస్ ఏంటో తెలుసా?

4 Jun, 2023 20:58 IST|Sakshi

Atmosphere Kombucha: గత కొన్ని సంవత్సరాలుగా జాబ్ చేసేవారి సంఖ్య కంటే సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ కారణంగా ఎన్నెన్నో ఆటంకాలను ఎదుర్కొని జీవితంలో సక్సెస్ సాధిస్తున్నారు. కొంత మంది తమ వ్యాపారాలను అమెరికా వంటి అగ్ర దేశాల్లో ప్రారంభించాలని కలలు కంటూ ఉంటారు. కానీ అమెరికాలో చదువుకున్న చెందిన ఇద్దరు అమ్మాయిలు ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు. ఇంతకీ ఈ అమెరికన్ సిస్టర్స్ ఎవరు? వారు ఇండియాలో చేస్తున్న బిజినెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతదేశంలో ఎంతో మంది యువకులు తమ నూతన ఆలోచనలతో ఎన్నెన్నో వ్యాపారాలను ప్రారంభించి విజయవంతమయ్యారు. ఉన్నత చదువులు చదవని వారు కూడా ఇందులో ఉందులో ఉండటం గమనార్హం. విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా చాలామంది భారతదేశంలో వ్యాపారాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి కోవకు చెందిన వారిలో 'రెబెకా సూద్ & అరియెల్లా బ్లాంక్' ఉన్నారు. 

(ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో అత్యంత ధనవంతురాలైన హిందూ మహిళ.. సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?)

అట్మాస్పియర్ కొంబుచ
అమెరికాలో చదువుకున్న రెబెకా సూద్, అరియెల్లా బ్లాంక్ ఇద్దరూ 2018లో దేశ రాజధాని ఢిల్లీలో 'అట్మాస్పియర్ కొంబుచ' (Atmosphere Kombucha) అనే పేరుతో వ్యాపారం మొదలు పెట్టారు. కొంబుచ అంటే పర్మెంటేడ్ అండ్ ఫ్లేవర్డ్ టీ డ్రింక్ అని అర్థం. గ్రీన్ టీని బ్యాక్టీరియా అండ్ ఈస్ట్‌తో పులియబెట్టడం ద్వారా ఈ ఉత్పత్తులు తయారు చేస్తారు. అవి అన్యదేశ లైమ్, కోలా, మామిడి పీచు, లీచీ లవ్, ఎల్డర్‌ఫ్లవర్, బ్లూబెర్రీ లావెండర్ వంటి వివిధ ఫ్లేవ‌ర్స్‌లో లభిస్తాయి. ఒక కొంబుచ బాటిల్ ధర రూ. 220 వరకు ఉంటుంది.

(ఇదీ చదవండి: మెట్లెక్కిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వైరల్ అవుతున్న వీడియో & ఫిదా అవుతున్న జనం)

అరియెల్లా బ్లాంక్ & రెబెకా సూద్ ఇద్దరూ ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో జన్మించినప్పటికీ పాఠశాల విద్య పూర్తయిన తరువాత అమెరికాకు వెళ్లారు. అక్కడే ఈ ఇద్దరూ కంప్యూటర్ సైన్స్‌ కోర్సులు చదివారు. ఇందులో అరియెల్లా బ్లాంక్ భారతదేశంలో గత ఆరు సంవత్సరాలుగా వెల్నెస్ కేఫ్‌లు, కార్పొరేట్‌లలో వందకు పైగా సెషన్‌లకు నాయకత్వం వహించింది. ఇక రెబెకా చైనాలో కూడా పనిచేసింది. ఆ తరువాత ఇండియా వచ్చింది. ఈ ఇద్దరూ కలిసి రూ. 25 లక్షల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. దీనికి వారి తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయం తీసుకున్నారు. ప్రస్తుతం వీరి టర్నోవర్ నెలకు రూ. 20 లక్షల కంటే ఎక్కువ అని తెలుస్తోంది.

A post shared by Atmosphere Studio (@atmosphere.in)

మరిన్ని వార్తలు