OnePlus Nord 2:యువకుడి జీన్స్‌ ఫ్యాంట్‌లో స్మార్ట్‌ ఫోన్‌.. టపాసుల‍్లా పేలింది..!

8 Nov, 2021 21:32 IST|Sakshi

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం 'వన్‌ప్లస్‌' కు చెందిన ఛార్జర్‌లు, ఫోన్‌లు టపాసుల్లా పేలుతున్నాయి. ఇప్పటికే పలువురు వన్‌ ప్లస్‌కు చెందిన తమ ఫోన్‌లు బ్లాస్ట్‌ అయ్యాయని, తగిన న్యాయం చేయాలని కోరుతూ కోర్ట్‌ మెట్లెక్కిన విషయం తెలిసిందే. తాజాగా మరో వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారుడి జీన్స్‌ ఫ్యాంట్‌ జేబులో ఉన్న వన్‌ ప్లస్‌ ఫోన్‌ పేలింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. 

నవంబర్‌ 3న ట్విట్టర్‌ యూజర్‌ సుహిత్‌ శర్మ(suhit sharama) అనే యూజర్‌ వన్‌ ప్లస్‌కు చెందిన వన్‌ ప్లస్‌ నార్డ్‌ 2 బ్లాస్ట్‌ అయ్యిందంటూ తీవ్రంగా గాయపడ్డ కొన్ని ఫోటోల్ని ట్వీట్‌ చేశారు. అంతేకాదు @OnePlus_IN మీ నుండి ఇది ఎప్పుడూ ఊహించలేదు. #OnePlusNord2Blast మీ ఫోన్‌ ఏం చేసిందో చూడండి అంటూ జీన్స్‌ ఫ్యాంట్‌లో ఫోన్‌ పేలిన ఇమేజెస్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈఘటనలో వన్‌ ప్లస్‌ యాజమాన్యం తీవ్రమైన పరిణామాల్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది. ప్రజల జీవితాలతో ఆడుకోవడం మానేయండి. త్వరలోనే మిమ్మల్ని కాంటాక్ట్‌ అవుతాము అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.  

సుహిత్‌ శర్మ ట్వీట్‌లపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొంత మంది యూజర‍్లు ఇప్పుడే తాము వన్‌ ప్లస్‌కు చెందిన ఫోన్‌లను బుక్‌ చేసుకున్నాం. వాటిని ఇప్పుడే క్యాన్సిల్‌ చేస్తామని రీట్వీట్‌లు పెడుతున్నారు. 

అయితే ఆ ట్వీట్‌లపై ఇండియా వన్‌ ప్లస్‌ యాజమాన్యం స్పందించింది. ఇలాంటి సమస్య ఎదుర్కొన్నందుకు క్షమించండి. బాధితుడికి అండగా ఉంటాం.డైరెక్ట్‌గా కాంటాక్ట్‌ అవ్వండి. పరిశీలించి, తగిన సాయం చేస్తాం' అంటూ ట్వీట్‌ చేసింది.

 చదవండి: బుల్లెట్ నుంచి మనిషి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్

>
మరిన్ని వార్తలు