భారత్‌లో యాపిల్‌ ఆదాయం రూ.50వేల కోట్లు.. టిమ్‌ కుక్‌ ఊహించి ఉండరు..

29 Oct, 2023 10:44 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఆదాయంలో అదరగొట్టేస్తుంది. భారత్‌లో ఆ సంస్థ వ్యాపారం రూ.50 వేల కోట్ల చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. 2022-23 దేశీయంగా యాపిల్‌ ఉత్పత్తుల అమ్మకాలు 48 శాతం వృద్దితో ఆదాయం రూ.49,321 కోట్లకు చేరింది. నెట్‌ ప్రాఫిట్‌ సైతం 76 శాతం పెరిగి రూ.2,229గా నమోదైనట్లు రెగ్యూలరేటరీ ఫైలింగ్‌లో యాపిల్‌ తెలిపింది.   

యాపిల్‌ భారత్‌లో గత ఐదేళ్ల నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మునుపెన్నడూ జరగని విధంగా ఈసారి ఊహించని విధంగా బిజినెస్‌తో పాటు అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా, యాపిల్‌ ప్రొడక్ట్‌ల తయారీ కోసం ఉపయోగించి విడి భాగాల ధరల తగ్గింపుతో న్యూజనరేషన్‌ ప్రొడక్ట్‌లు మాక్‌, హోం ప్యాడ్‌, ఐఫోన్‌ 15ల అమ్మకాల షేర్‌, మార్జిన్ సేల్స్‌ పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 


 
ఈ ఏడాదిలో యాపిల్‌ రూ.45 వేలకంటే విలువైన ఐఫోన్‌లు 59 శాతం షేర్‌ను సాధించగా.. షిప్‌మెంట్‌ 56 శాతం జరిగింది. నిర్వహణ పరంగా చూస్తే.. నిర్వహణ ఖర్చు5.4 శాతంతో, ప్రొడక్ట్‌ల అమ్మకాలు   94.6 శాతంతో జరిగినట్లు యాపిల్‌ రెగ్యూలరేటరీలో ఫైల్‌ చేసింది. గత ఏడాది 2022తో పోలిస్తే  విదేశీ మారకపు అవుట్‌ ఫ్లో 2023లో 2 శాతం పెరిగి రూ.18,140కి, విదేశీయ మారకం ఆదాయం 39 శాతంతో రూ.2,662గా నమోదైంది. 


 
ఈ సందర్భంగా గడిస్తున్న ఆదాయంతో భారత్‌లో యాపిల్‌ దీర్ఘ కాలం వ్యాపార శక్తి సామర్ధ్యాలు మెండుగా ఉన్నాయని నిరూపిస్తుందని బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ తరణ్‌ పాఠక్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు