విపక్ష ఎంపీల ఐఫోన్లకు అలర్టులు...

26 Nov, 2023 06:40 IST|Sakshi

భారత్‌కు యాపిల్‌ బృందం

న్యూఢిల్లీ: దిగ్గజ ఐటీ కంపెనీ యాపిల్‌ సైబర్‌ సెక్యూరిటీ ప్రతినిధులు త్వరలో భారత్‌కు రానున్నారు. గత నెలలో కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతల ఐఫోన్లలో వార్నింగ్‌ నోటిఫికేషన్లు ప్రత్యక్షమ వడంతో తీవ్ర దుమారం రేగిన తెలిసిందే. కేంద్ర ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్‌ చేయిస్తోందంటూ వారు ఆరోపణలు చేశారు.

ఈ వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ శాఖ ఆధ్వర్యంలోని సీఈఆర్‌టీ–ఐఎన్‌(కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం) యాపిల్‌ సంస్థకు నోటీసులిచ్చింది. భారత్‌లోని యాపిల్‌ సంస్థ ప్రతినిధులు సీఈఆర్‌టీ–ఐఎన్‌ నిపుణులను కలుసుకున్నారు. అయితే, ఈ సమస్య వారి సా మర్థ్యానికి మించినదని తేలింది. దీంతో త్వర లోనే అమెరికా నుంచి యాపిల్‌ సైబర్‌ సెక్యూ రిటీ ప్రతినిధుల బృందం ఇక్కడికి రానుందని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వివరించారు.

మరిన్ని వార్తలు