Survey : గూగుల్‌ ఉద్యోగులైతే చాలు.. యాపిల్‌ బంపరాఫర్‌!

25 Nov, 2023 14:49 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజాలైన యాపిల్‌, గూగుల్‌, ఇంటెల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు.. గతంలో ఏ కంపెనీలో పని చేశారు. ఒక టెక్‌ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది ఇతర టెక్నాలజీ కంపెనీల్ని ఇష్టపడుతున్నారా? ఇలాంటి ఆసక్తిర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

లింక్డిన్‌ ప్రొఫైల్స్‌ ఆధారంగా తేలిన సర్వే ప్రకారం.. గూగుల్‌కు నుంచి యాపిల్‌లో చేరిన ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్‌లో పనిచేస్తున్న సిబ్బంది గతంలో ఇంటెల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌లో పని చేసినట్లు సర్వే పేర్కొంది. 

సర్వే ఎలా చేశారు
టెక్కీల గురించి ఏ సంస్థ సర్వే నిర్వహించిందనే విషయాలపై స్పష్టత లేదు. అయితే సర్వే చేసిన ప్రతినిధులు.. ముందుగా గూగుల్‌,అమెజాన్‌, యాపిల్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌, ఐబీఎం, ఒరాకిల్‌, నెట్‌ఫ్లిక్స్‌, ఎన్విడియా, సేల్స్‌ ఫోర్స్‌, అడోబ్‌, ఇంటెల్‌, ఊబర్‌ ఉద్యోగుల లింక్డిన్‌ ప్రొఫైల్‌ని చెక్‌ చేశారు. ఆ ప్రొఫైల్స్‌లో టెక్కీలు ప్రస్తుతం, గతంలో ఏ కంపెనీలో పనిచేశారో గుర్తించి.. వారిని పర్సంటేజీల వారీగా పరిగణిస్తే చివరిగా ఏ సంస్థ ఉద్యోగులు ఎవరు, ఎక్కడ పనిచేశారో నిర్ధారించారు. 

దీన్నిబట్టి యాపిల్‌ సంస్థ అమెజాన్‌, అడోబ్‌, గూగుల్‌ ఉద్యోగుల్ని నియమించుకునేందుకు మక్కువ చూపితే.. యాపిల్ ఉద్యోగులు మాత్రం గూగుల్‌లో చేరేందుకు ఇష్టం చూపిస్తున్నట్లు నివేదికలు హైలెట్‌ చేశాయి. 

ఈ సంస్థ ఉద్యోగులకు గ్రీన్‌ సిగ్నల్‌
యాపిల్‌ సంస్థ..అమెజాన్‌, అడోబ్‌, గూగుల్‌, ఐబీఎం, ఇంటెల్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌, ఎన్విడియా, ఒరాకిల్‌, టెస్లా ఈ పది కంపెనీల వర్క్‌ ఫోర్స్‌ని నియమించుకునేందుకు ప్రాదాన్యం ఇస్తుంది. 2019లో ఇంటెల్‌ స్మార్ట్‌ ఫోన్‌ మోడెమ్‌ బిజినెస్‌ని యాపిల్‌ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి కుపెర్టినో దిగ్గజం (యాపిల్‌) ఇంటెల్‌ ఉద్యోగుల్ని నియమించుకుని వారితో తన సొంత రేడియో చిప్‌లను తయారు చేయించుకునేందుకు నిమగ్నమైంది. 

యాపిల్‌ ఉద్యోగులు రిజైన్‌ చేసి మరో టెక్‌ కంపెనీలో చేరే జాబితాలో గూగుల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఎన్విడియా, సేల్స్‌ఫోర్స్, అడోబ్, ఇంటెల్, ఒరాకిల్‌లు ఉన్నాయి. 

గూగుల్‌ మాజీల వైపు యాపిల్‌ చూపు 
సర్వే ప్రకారం.. గూగుల్‌ మాజీ ఉద్యోగుల్ని యాపిల్‌ హయర్‌ చేసుకునేందుకు ఇష్టపడుతుంది. గూగుల్‌ తర్వాత మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. గూగుల్‌లో ఉద్యోగం చేసేందుకు సుమారు రెండు లక్షల మంది ఉద్యోగాల కోసం అప్లయ్‌ చేసుకుంటుండగా.. గతంలో మైక్రోసాఫ్ట్‌లో పనిచేసిన 12,108 మంది ఉద్యోగుల్ని గూగుల్‌ ఎంపిక చేసుకుంది. 

మెటాలో టెక్నాలజీ రంగాల్లో నిపుణులైన ఉద్యోగుల సంఖ్య అత్యధికంగా 26.51శాతంగా ఉంది. గూగుల్‌లో పనిచేసిన ఉద్యోగులు 24.15శాతం, ఐబీఎంలో 2.28 శాతం మంది మెటాలో చేరారు. అలాగే కొత్త అవకాశాల కోసం 3,363 మంది గూగుల్‌ ఉద్యోగులు మెటాలో చేరినట్లు నివేదిక స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు