-

ఒక్క యాప్.. స్పామ్ కాల్స్‌కు చెక్ - ఎలా ఉపయోగించాలంటే?

27 Nov, 2023 09:25 IST|Sakshi

టెక్నాలజీ పెరిగిపోతున్న సమయంలో ఫేక్ కాల్స్ లేదా స్పామ్ కాల్స్‌ పెరిగిపోతున్నాయి. అనవసరమైన కాల్స్, మెసేజ్‌లకు స్వస్తి పలకడానికి 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) ఓ కొత్త యాప్ తీసుకువచ్చింది. ఈ లేటెస్ట్ యాప్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

భారతదేశంలో కమ్యూనికేషన్ నిబంధనలను పర్యవేక్షించే 'ట్రాయ్' వినియోగదారులకు విసుగు తెప్పించే కాల్స్, మెసేజస్ వంటి వాటిని నిరోధించుకోవడానికి లేదా పరిష్కరించడాని 'డు నాట్ డిస్టర్బ్' (DND) యాప్ డెవెలప్ చేసింది. అయితే ఇందులో కొన్ని టెక్నికల్ సమస్యలు తలెత్తడం వల్ల దీనిని వినియోగించడంలో కొన్ని సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు  ట్రాయ్ కార్యదర్శి 'రఘునందన్' వెల్లడించారు. 

ట్రాయ్ డెవెలప్ చేసిన డు నాట్ డిస్టర్బ్ యాప్ ప్రధాన ఉద్దేశ్యం అవాంఛిత కాల్స్ లేదా మెసేజ్‌లను పూర్తిగా నిషేధించడమే. ఈ యాప్ సాయంతో వినియోగదారులు తమకు ఇబ్బందికరమైన కమ్యూనికేషన్‌లను సులభంగా నివేదించవచ్చు, పూర్తిగా నిరోధించవచ్చు.

యాప్‌లో సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై రఘునందన్ మాట్లాడుతూ.. యాప్‌లో బగ్‌లను గుర్తించి పరిష్కరించడానికి ట్రాయ్ ఇప్పటికే ఏజెన్సీని నియమించింది, దీంతో ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. 2024 నాటికి ఇందులో ఎలాంటి సమస్యలు లేకుండా చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఐఫోన్లలో యాపిల్ పరిమితుల కారణంగా ఈ యాప్ పనిచేసే అవకాశం లేదు. రానున్న రోజుల్లో ఈ మొబైల్స్‌లో కూడా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంకుపై చర్యలు

ప్రతి రోజూ సుమారు 5 మిలియన్స్ కంటే ఎక్కువ స్పామ్ కాల్స్ వస్తున్నాయని, వీటి భారీ నుంచి విముక్తి చేయడానికి ట్రాయ్ ఈ యాప్ రూపొందించినట్లు తెలుస్తోంది. 

'డు నాట్ డిస్టర్బ్' యాప్ ఎలా ఉపయోగించాలి

  • గూగుల్ ప్లే స్టోర్‌లో TRAI DND 3.0(Do Not Disturb) యాప్ సర్చ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
  • డౌన్‌లోడ్ పూర్తయిన తరువాత యాప్ ఓపెన్ చేసి.. OTP వెరిఫికేషన్ పూర్తి చేసి సైన్ ఇన్ చేసుకోవాలి.
  • సైన్ ఇన్ పూర్తి చేసుకున్న తరువాత అవాంఛిత కాల్స్, టెక్స్ట్‌లను బ్లాక్ చేయడానికి మీ మొబైల్ నెంబర్ 'డు నాట్ డిస్టర్బ్' జాబితాకు యాడ్ అవుతుంది.
  • యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత కూడా మీకు స్పామ్ కాల్స్ వస్తున్నట్లతే.. తప్పకుండా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ వారికి కంప్లైన్ట్ చేయాలి.
మరిన్ని వార్తలు