గేమింగ్ ఫోన్‌పై ఏకంగా రూ.14 వేల తగ్గింపు

19 Apr, 2021 20:33 IST|Sakshi

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ కార్నివాల్‌లో అసుస్ రోగ్ ఫోన్ 3పై భారీ తగ్గింపును అందించింది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.10,000 తగ్గింపు లభించడం విశేషం. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్‌ను అందించారు. 6.59 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే, 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర గతంలో రూ.55,999గా ఉండగా ఈ సేల్‌లో రూ.41,999కే విక్రయిస్తున్నారు. అలాగే, 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.57,999 నుంచి రూ.12,000 తగ్గింపుతో రూ.45,999కు అందిస్తున్నారు.

అసుస్ రోగ్ ఫోన్ 3 ఫీచర్లు: 

  • 6.59 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ హెచ్‌డీఆర్ డిస్ ప్లే
  • 144 హెర్ట్జ్‌ రిఫ్రెష్ రేట్
  • క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్‌
  • 64 ఎంపీ + 13 ఎంపీ + 5 ఎంపీ మెయిన్ కెమెరా
  • 24 ఎంపీ సెల్పీ కెమెరా
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 5జీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్ 
  • ఆండ్రాయిడ్ 10 ఓఎస్ 

చదవండి: బజాజ్ చేతక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్! 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు