రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!

15 May, 2023 18:39 IST|Sakshi

Australia Job Ad: ఏ దేశంలో అయినా డాక్టర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి విజృంభణ తరువాత ఈ డిమాండ్ మరింత పెరిగింది. ఈ డిమాండ్‌తో పాటు వేతనాలు కూడా భారీగా పెరిగాయి. అయితే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో డాక్టర్లకు అద్భుతమైన శాలరీ మాత్రమే కాకుండా, అంతకు మించిన స్పెషలిటీస్ కూడా అందిస్తున్నాయి. ఇటీవల ఒక ట్విటర్ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

రూ. కోటికి పైగా ప్యాకేజీ..
సోషల్ మీడియాలో వెల్లడైన జాబ్ యాడ్ పోస్ట్ ప్రకారం, ఏడాదికి రూ.1.30 కోట్లు జీతం అందిస్తామని, అంతే కాకుండా నెలలో కేవలం 10 రోజులు మాత్రమే పని దినాలు, మిగిలిన 20 రోజులు సెలవులు అని తెలిపింది. ఇది జాబ్ అడ్వర్టైజ్‌మెంట్ బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ యూనియన్ ప్రముఖ జర్నల్ BMJలో ప్రచురితమైంది. ఇంకా సైన్ ఇన్ బోనస్ కింద రూ. 2.7 లక్షలు కూడా అందుతాయని తెలుస్తోంది.

ఆస్ట్రేలియన్ మెడికల్ రిక్రూట్‌మెంట్ సంస్థ బ్లూగిబ్బన్ ఈ యాడ్ రూపోంచినట్లు తెలుస్తోంది. ఇందులో ఆస్ట్రేలియా నేషనల్ హెల్త్ స్కీమ్‌తో (NHS) కలిసి పనిచేయాలని వెల్లడించింది. ఇది డాక్టర్లకు గొప్ప అవకాశం అనే చెప్పాలి. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆస్ట్రేలియాలో ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వం మధ్య వేతనాలకు సంబంధించి వివాదం నడుస్తూనే ఉంది.

(ఇదీ చదవండి: ఇండియన్ సెలబ్రిటీల మనసు దోచిన అమెరికన్ బ్రాండ్ కారు, ఇదే - చూసారా..!)

ముఖ్యంగా యూకేలోని గ్రాడ్యుయేట్ డాక్టర్లను ఆస్ట్రేలియా ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్, ఎమర్జెన్సీ, ఎక్స్పీరియన్స్ వంటివి ఉన్నవారికి ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంది. మొత్తం మీద ఎక్కువ శాలరీ కావాలనుకునే డాక్టర్లు ఆస్ట్రేలియన్ అందిస్తున్న ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. ఈ ఉద్యోగంలో చేరేవారికి వసతి సదుపాయం కూడా లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

మరిన్ని వార్తలు