Bank holidays November 2022 : నవంబర్‌లో బ్యాంకు సెలవుల జాబితా ఇదే

30 Oct, 2022 21:09 IST|Sakshi

ఆర్‌బీఐ ప్రతినెల బ్యాంక్‌ హాలిడేస్‌ను ప్రకటిస్తుంది. నవంబర్‌ నెలలో సైతం బ్యాంక్‌లకు ఎన్ని రోజులు సెలవులనే అంశంపై స్పష్టత ఇచ్చింది. నవంబర్ నెలలో గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ, కనకదాస్ జయంతి, వంగ్లా ఫెస్టివల్, కన్నడ రాజ్యోత్సవం, కుట్ ఫెస్టివల్, సెంగ్ కుత్సానేం వంటి  పండుగలు ఉన్నాయి.

ఈ పండుగల సందర్భంగా ఆయా రాష్ట్రాల్ని బట్టి బ్యాంకు హాలిడేస్‌ను ఇస్తుంటాయి. కాబట్టి హాలిడేస్‌ను ముందుగానే గుర్తించి మిగిలిన రోజుల్లో బ్యాంకుల్లో ఏదైనా పనులు ఉంటే చక్కబెట్టుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. ఆర్‌బీఐ ప్రకటించిన బ్యాంక్‌ సెలవులు ఇలా ఉన్నాయి.  

నవంబర్ 1 : కన్నడ రాజ్యోత్సవ (కర్నాటక)

నవంబర్ 6 : ఆదివారం

నవంబర్ 8 : గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ, రహాస్ పూర్ణిమ

నవంబర్ 11 : కనకదాస్ జయంతి,వంగలా ఫెస్టివల్

నవంబర్ 12 : రెండో శనివారం

నవంబర్ 13 : ఆదివారం

నవంబర్ 20 : ఆదివారం

నవంబర్ 23 : సెంగ్ కుత్సానేం బెంగళూరు, షిల్లాంగ్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి .

నవంబర్ 26 : నాలుగో శనివారం

నవంబర్ 27 : ఆదివారం

మరిన్ని వార్తలు