టాటా చేతికి విస్ట్రన్‌.. ఇక ‘ఐఫోన్‌ మేడిన్‌ టాటా’

12 Nov, 2023 08:29 IST|Sakshi

భారత్‌లో యాపిల్‌ ఐఫోన్‌లను సరఫరా చేసే విస్ట్రన్‌ కంపెనీని ప్రముఖ డైవర్సిఫైడ్‌ దిగ్గజం టాటా గ్రూప్‌ పూర్తి స్థాయిలో టేకోవర్‌ చేసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో యాపిల్‌ ఐఫోన్‌లను తయారు చేసే తొలి దేశీయ కంపెనీగా టాటా గ్రూప్‌ అవతరించనుంది. 

టాటా గ్రూప్‌ ఇప్పటికే తమిళనాడు కేంద్రంగా విడి భాగాలను తయారు చేసి వాటిని  యాపిల్‌కు అందిస్తుంది. అయితే ఇప్పుడు విస్ట్రన్‌ టేకోవర్‌తో పాక్స్‌కాన్‌, పెగాట్రాన్ తరహాలో టాటా సంస్థ ఐఫోన్‌లను తయారు చేస్తుంది. 

విస్ట్రన్ ఇండియాలో 100 శాతం షేర్ల కొనుగోలు ఒప్పందంపై టాటా గ్రూప్ సంతకం చేసినట్లు కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో యాపిల్ ఐఫోన్ల అసెంబ్లింగ్ కాంట్రాక్ట్ పొందేందుకు విస్ట్రన్ ఇండియాకు సుమారు రూ.1040 కోట్లు టాటా గ్రూప్ చెల్లించనున్నది.

మరిన్ని వార్తలు