Bill Gates: ఫౌండేషన్‌కు లక్షన్నర కోట్ల విరాళం..ప్రకటించిన బిల్‌ గేట్స్‌!

15 Jul, 2022 14:13 IST|Sakshi

మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు తన ఆస్తిలో సుమారు 20 బిలియన్‌ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. 

ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు, ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించేందుకు నా వంతు సాయం చేస్తున్నాను. అందుకే నాకు, నాకుటుంబానికి కావాల్సినంత ఖర్చు చేసి మిగిలిన మొత్తం ఫౌండేషన్‌కు ఇవ్వాలని భావిస్తున్నా. ఇందులో భాగంగా బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌కు లక్షన్నకోట్లు విరాళం ఇస్తున్నట్లు బిల్‌ గేట్స్‌ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. 

ప్రపంచంలోనే అత్యంత కుబేరుల స్థానంలో ఉన్న బిల్‌గేట్స్‌కు సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. పెరిగిపోతున్న సంపదను ప్రపంచ జనాభా ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు ఖర్చు చేస్తుంటారు. అందుకే మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ గేట్స్‌ - మిలిండా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి తన సంపాదనలో సింహభాగం అటు తరలించాడు. ఈ ఫౌండేషన్‌ ద్వారా ప్రపంచ దేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఆ ఫౌండేషన్‌కు బిల్‌గేట్స్‌ పెద్దమొత్తంలో విరాళం ఇవ్వడంపై ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు