Zomato Orders Details 2023: ఎంద చాటా.. వీళ్లు తిన్న నూడిల్స్‌తో భూమిని 22 సార్లు చుట్టిరావొచ్చు!

26 Dec, 2023 08:45 IST|Sakshi

పాతొక రోత.. కొత్తొక వింత. పాశ్యాత్య సంస్కృతుల్ని, ఆహార సంప్రదాయాల్ని మనవాళ్లు ఇష్టపడుతుండడం కొత్త కాకపోవచ్చు. ఇప్పటికే వస్త్రధారణలో వెస్ట్రన్‌ కల్చర్‌ను దాటేసి పోయారు. తినే తిండిలోనూ అదే ధోరణిని కనబరుస్తున్నారు. సాక్ష్యం ఏంటంటారా?.. దేశీయ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో అందుకు సమాధానాలు ఇస్తోంది. 

2023 మరికొన్నిరోజుల్లో ముగియనున్న తరుణంలో ఆయా ఫుడ్‌ డెలివరీ సంస్థ ఏడాది మొత్తం మీద ఏ ఫుడ్‌ ఐటమ్‌ను ఎక్కువగా డెలివరీ చేశామని విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇటలీలో పుట్టిన పిజ్జా భారతీయులు అమితంగా ఇష్టపడే ఆహార వంటకంగా ప్రసిద్ధికెక్కుతోంది. ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో నివేదిక ప్రకారం.. 2023లో భోజన ప్రియులకు అత్యంత ఇష్టమైన ఆహార పదార్ధాలలో బిర్యానీ, పిజ్జాలు వరుస స్థానాల్ని దక్కించుకున్నాయి. 

తన ప్లాట్‌ఫామ్‌ మీద 10.09 కోట్ల బిర్యానీల కోసం ఆర్డర్‌ పెట్టుకుంటే, రెండో స్థానంలో ఉన్న పిజ్జాను 7.45 కోట్ల ఆర్డర్లు పెట్టినట్లు జొమాటో తెలిపింది. 

తద్వారా ఈ ఏడాదిలో పెట్టిన బిర్యానీ ఆర్డర్‌లతో ఢిల్లీలో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో 'కుతుబ్ మీనార్'ను, కోల్‌కతాలో ఉన్న ఐదు కంటే ఎక్కువ ఈడెన్‌ గార్డెన్ స్టేడియంలతో సమానమైన పిజ్జాలను ఫుడ్‌ లవర్స్‌ ఆర్డర్‌ పెట్టినట్లు పేర్కొంది. 

మూడవ స్థానంలో 4.55 కోట్ల నూడిల్స్‌ ఆర్డర్‌ పెట్టారు. ఫుడ్‌ లవర్స్‌ పెట్టిన ఆ నూడిల్స్‌ ఆర్డర్‌తో భూమిని 22 సార్లు చుట్టడానికి ఇది సరిపోతుందని డెలివరీ దిగ్గజం వెల్లడించింది. 
 
స్విగ్గీలో ఎక్కువగా కేక్‌లు ఆర్డర్‌ రావడంతో బెంగళూరు కేక్‌ కేపిటల్‌గా అవతరించింది. ఫుడ్‌ లవర్స్‌ ఈ ఏడాది అత్యధికంగా జొమాటోలో బ్రేక్‌ ఫాస్ట్‌ను ఆర్డర్‌ పెట్టుకోగా, ఢిల్లీకి చెందిన వినియోగదారులు ఎక్కువ మంది అర్ధరాత్రి ఆర్డర్‌ చేసుకున్నారు. 

జొమాటోకి ఈ ఏడాదిలో అత్యధికంగా బెంగళూరు నుంచి ఫుడ్‌ ఆర్డర్లు వచ్చాయి. ఒక్క ఆర్డర్‌ ఖరీదు అక్షరాల రూ.46,273. అదే సమయంలో  రూ.6.6లక్షల విలువ చేసే 1389 గిఫ్ట్‌ ఆర్డర్‌లు పెట్టారు. ఆ తర్వాత ముంబై వాసులు ఒక్కరోజే 121 ఆర్డర్‌లు పెట్టారు. 

నేషన్‌ బిగ్గెస్ట్‌ ఫూడీ జాబితాలో 
నేషన్‌ బిగ్గెస్ట్‌ ఫూడీ జాబితాలో ముంబై నిలిచింది. ఈ ప్రాంతం నుంచి ఏడాది మొత్తం వరకు 3,580 ఆర్డర్‌లు రాగా.. రోజుకి కనీసం 9 ఆర్డర్‌లు పెట్టినట్లు జొమాటో హైలెట్‌ చేసింది. 

బిర్యానీకి తిరుగులేదు
వరుసగా 8వ సంవత్సరం సైతం స్విగ్గీలో ఎక్కువ బిర్యానీ ఆర్డర్‌ పెట్టినట్లు ఆ సంస్థ తన ఇయర్‌ ఎండర్‌ 2023 రిపోర్ట్‌లో తెలిపింది. 

ప్రతి సెకనుకు 2.5 బిర్యానీ ప్యాకెట్ల ఆర్డర్‌
ఇక దేశీయంగా ఉన్న ఫుడ్‌ లవర్స్‌ ప్రతి సెకండ్‌కు 2.5 బిర్యానీ ప్యాకెట్లను ఆర్డర్‌ పెట్టారు. వారిలో హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి ఏడాది మొత్తం మీద 1633 బిర్యానీ ఆర్డర్‌లు పెట్టాడు. దీంతో బిర్యానీని ఎక్కువగా తినే ఫుడీల జాబితాలో హైదారబాద్‌ వాసులు నిలిచారు. స్విగ్గీ ఆర్డర్‌లో ప్రతి 6వ ఆర్డర్‌ ఇక్కడే నుంచే రావడం గమనార్హం. 2023లో ముంబైకి చెందిన ఓ ఫుడ్‌ లవర్స్‌ రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్లు పెట్టడం ఆసక్తికరంగా మారింది.  

>
మరిన్ని వార్తలు