సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు

26 Dec, 2023 09:42 IST|Sakshi

దేశీయ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ 17 పాయింట్లు లాభంతో 21,363 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 29 పాయింట్లు లాభంతో 71,139 వద్ద ట్రేడవుతుంది.

ఈక్విటీ మార్కెట్లో ఇప్పటికే అధిక కొనుగోళ్లు జరిగినందున, మరికొంత లాభాల స్వీకరణకు అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. షేర్లు పడినపుడల్లా కొనుగోలు చేసే వ్యూహాన్ని మదుపర్లు కొనసాగించే అవకాశం ఉన్నందున, భారీ నష్టాలు ఉండకపోవచ్చని అంటున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడుల్లో మందగమనమూ, మార్కెట్‌ స్థిరీకరణకు కారణంగా నిలవొచ్చని భావిస్తున్నారు. నిఫ్టీ-50 సూచీ 21,200-21,500 పాయింట్ల మధ్య కదలాడొచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, ఎం అండ్‌ ఎం, బజాన్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌ అండ​్‌ టీ, ఎస్‌బీఐ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, టైటాన్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పేయింట్స్‌, రిలయన్స్‌ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

>
మరిన్ని వార్తలు