బీఎండబ్ల్యూకి భారీ షాక్‌..వెంటనే డ్రైవింగ్‌ ఆపేయండి,షెడ్డుకు లక్షల కార్లు!

10 Mar, 2022 18:24 IST|Sakshi

ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూకి భారీ షాక్‌ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా బీఎండబ్ల్యూ వెహికల్స్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వరల్డ్‌ వైడ్‌గా 1.03 మిలియన్‌ వెహికల్స్‌ను రీకాల్‌ చేస్తున్నట్లు బీఎండబ్ల్యూ అధికారికంగా తెలిపింది. 

2017నుంచి బీఎండబ్ల్యూ ఇప్పటి వరకు రెండు సార్లు తమ కార్లను రీకాల్‌ చేసింది. తాజాగా 2006 నుంచి 2013 మధ్య కాలంలో తయారు చేసిన కార్లతో పాటు 1సిరీస్, 3సిరీస్, ఎక్స్‌ 3, 5సిరీస్, ఎక్స్‌ 5, జెడ్‌ 4 మోడల్‌ కార్లు ఉన్నాయి. పాజిటివ్ క్రాంక్‌కేస్ వెంటిలేషన్ వాల్వ్ (పీసీవీ) కోసం హీటర్ షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదాలు అరుదుగా జరిగినా.. అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.   

డ్రైవింగ్‌ చేయడం ఆపండి
కొత్తగా రీకాల్‌ చేసిన కార్లు ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్‌లో 917,106, కెనడాలో 98,000, దక్షిణ కొరియాలో 18,000 వాహనాలు ఉన్నాయని బీఎండబ్ల్యూ వెల్లడించింది. గతంలో 2017లో 740,000, 2019లో 184,000 వాహనాల్ని రీకాల్‌ చేయగా..తాజాగా భారీ ఎత్తున కార్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం తాము తయారు చేస్తున్న కొత్తకార్లకి, రీకాల్‌ చేసిన కార్లకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. తాజా రీకాల్‌కు సంబంధించి ఎలాంటి ప్రమాదాలు లేదా గాయాల గురించి తమకు తెలియదని, రీకాల్ పరిష్కారానికి సంబంధించి యజమానులు డ్రైవింగ్‌ను ఆపాల్సిన అవసరం లేదని చెప్పింది. అయితే ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌కు సమీపంలో ఉన్న ప్రాంతం నుండి పొగ లేదా పొగ వాసన లేదా ప్లాస్టిక్ మండే వాసన కనిపించినట్లయితే వెంటనే డ్రైవింగ్ చేయడం ఆపేయాలని బీఎండబ్ల్యూ స్పష్టం చేసింది.

చదవండి: బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం...! తొమ్మిదేళ్ల ప్రస్థానానికి ఎండ్‌ కార్డ్‌..!

మరిన్ని వార్తలు