వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ శుద్ధ దండగ..ఆఫీస్‌లో పనిచేయండి!

15 May, 2022 17:03 IST|Sakshi

కరోనా కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా తగ్గడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉద్యోగస్తుల్ని కార్యాలయాలకు రావాలని పిలుపునిస్తున్నాయి. ఉద్యోగులు మాత్రం తమకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కావాలని, లేదంటే జాబ్స్‌కు రిజైన్‌ చేస్తామని బాస్‌లకు మెయిల్స్‌ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పై యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. 

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో మీకు సౌకర్యంగా ఉన్నా.. అదంత మంచిదేమీ కాదు. ఎందుకంటే ఇంట్లో ఉండి చేస్తున్న పనికంటే ఇతర వ్యాపకాలపై మనదృష్టి మరులుతుంది. కాఫీలు, ఛీజ్‌లు తినడంలో సగం సమయం గడిచిపోతుంది. కాబట్టి ఉద్యోగులు ఆఫీసుల్లో పనిచేయడమే ఉత్తమం.అలా చేస్తే ప్రొడక్టివిటీతో పాటు ఎనర్జీ, కొత్త కొత్త ఐడియాలు పుట‍్టుకొస్తాయని బోరిస్‌ జాన్సన్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపినట్లు దిగార్డియన్‌ తన కథనంలో ప్రస‍్తావించింది. 

అంతేకాదు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో ఉండే ఉద్యోగులు కప్పు కాఫీ తాగేందుకు చాలా సమయం పడుతుంది. కాఫీ చేసేందుకు సిస్టం ముందు లేచి ఫ్రిజ్‌ దగ్గరికి వెళ్లడం,ఆ పక్కనే ఉన్న చీజ్‌ ముక్కల్ని కట్ చేయండం'లాంటి పనుల్ని చేయాల్సి వస్తుంది. ఆ పని పూర్తి చేసుకొని సిస్టం దగ్గర కూర్చుంటే మీరు ఏం పనిచేస్తున్నారో మరిచి పోతారు. ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఆఫీస్‌లో పనిచేయడం ఉత్తమం అంటూ యూకే ప్రధాని ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు