రెన్యూ పవర్‌ చేతికి ఎల్‌అండ్‌టీ హైడ్రో ప్రాజెక్టు

12 Aug, 2021 04:17 IST|Sakshi

రూ. 985 కోట్ల డీల్‌

న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) తమ అనుబంధ సంస్థకు చెందిన హైడ్రోఎలక్ట్రిక్‌ ప్లాంటులో 100 శాతం వాటాలను రెన్యూ పవర్‌ సర్వీసెస్‌కు విక్రయించింది. ఈ డీల్‌ విలువ రూ. 985 కోట్లు. ఇతర వ్యాపారాల నుంచి తప్పుకుని ప్రధాన వ్యాపారాల మీద మరింతగా దృష్టి పెట్టాలనే ప్రణాళికకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్‌అండ్‌టీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ డీకే సెన్‌ వెల్లడించారు. ఎల్‌అండ్‌టీ ఉత్తరాంచల్‌ హైడ్రోపవర్‌ (ఎల్‌టీయూహెచ్‌పీఎల్‌)కి చెందిన ఈ ప్రాజెక్టు విక్రయ డీల్‌ సెప్టెంబర్‌ 30లోగా పూర్తి కాగలదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రాజెక్టును కొనుగోలు చేయడం వల్ల తమకు అదనపు ప్రయోజనాలు లభించగలవని, రిస్కు స్థాయి కూడా తక్కువగా ఉండగలదని రెన్యూ పవర్‌ చైర్మన్‌ సుమంత్‌ సిన్హా తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని హైడ్రో ప్రాజెక్టులన కొనుగోలుపై దృష్టి పెట్టనున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు