రూ.190కే అదిరిపోయే 5జీ బ్రాండెడ్‌ స్మార్ట్ ఫోన్‌!! ఈ ఆఫ‌ర్ అస్స‌లు మిస్ చేసుకోవ‌ద్దు!

10 Feb, 2022 16:16 IST|Sakshi

ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్ యూజ‌ర్ల‌కు బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించింది. ప్ర‌త్యేక త‌గ్గింపుల‌తో రూ.16,990ఫోన్‌ను కేవ‌లం రూ.190కే అందిస్తున్న‌ట్లు తెలిపింది. 

ఫిబ్ర‌వ‌రి14న ప్రేమికుల దినోత్సవం సంద‌ర్భంగా దేశీయ ఈకామ‌ర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్స్ పేరుతో ఆఫ‌ర్ల‌లో త‌క్కువ ధ‌ర‌కే 4జీ, 5జీ స్మార్ట్ ఫోన్స్‌ను అందిందిస్తుంది. ఇక ఫిబ్ర‌వ‌రి 14 వ‌ర‌కు జ‌రిగే ఈ సేల్ లో ఒప్పో 5జీ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఏ53ఎస్‌పై భారీ తగ్గింపులతో పాటు తక్షణ క్యాష్ బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కలిపి రూ. 16,990 విలువైన స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.190లకే అందుబాటులోకి తెచ్చింది.  

ఒప్పో ఏ53ఎస్ 5జీ పై ఆఫర్లు 
ఏప్రిల్ 27,2021లో విడుద‌లైన ఒప్పో ఏ53ఎస్ 5జీ ఫోన్ ప్రారంభ ధ‌ర‌ రూ.16,900 ఉండ‌గా..ప్ర‌స్తుతం ఈ ఫోన్ ధ‌ర ఆన్ లైన్ లో రూ.15,990కే కొనుగోలు చేయోచ్చు. యాక్సిస్ బ్యాంకు క్రెడిడ్ కార్డుతో రూ.800 క్యాష్ బ్యాక్, స్మార్ట్ ఫోన్ పై ఎక్స్ఛేంజ్ కింద రూ.15,000 వ‌ర‌కు ఆఫర్ పొందవచ్చు. తద్వారా 5జీ ఫోన్‌ను రూ.190కే సొంతం చేసుకోవ‌చ్చు. 

ఒప్పో ఏ53ఎస్ ఫీచ‌ర్లు

90హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.52 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే

వెనుక 13ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు

8ఎంపీ సెల్ఫీ కెమెరా

మీడియా టెక్ డైమ‌న్సిటీ 700 5జీ ప్రాసెస‌ర్‌

5,000 ఏంఎంహెచ్ బ్యాట‌రీ, 10డ‌బ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌

6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్‌తో పాటు 8 జీబీ 128జీబీ

చ‌ద‌వండి: ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..! ఇకపై మరింత సులువుగా..!
 

మరిన్ని వార్తలు