ఎల్‌ఐసీలో 20 శాతం వరకు ఎఫ్‌డీఐ 

27 Feb, 2022 03:21 IST|Sakshi

గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్న ప్రభుత్వం  

నిబంధనల సవరణకు కేబినెట్‌ భేటీ 

న్యూఢిల్లీ: ఐపీవో దిశగా దూసుకెళ్తున్న బీమా రంగ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌(ఎల్‌ఐసీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఐసీలో ఆటోమేటిక్‌ రూట్‌లో 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లకు కేంద్ర మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపిందని సమాచారం. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఈ బీమా సంస్థలో వాటాను పాక్షికంగా విక్రయించడం, తాజా ఈక్విటీ మూలధనాన్ని పెంచడం ద్వారా ఐపీవోతో (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌) స్టాక్‌ మార్కెట్లో ఎల్‌ఐసీ షేర్లను లిస్టింగ్‌ చేసేందుకు ప్రభుత్వం ఆమోదించింది. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్‌ ఆఫర్‌కు వేదికగా నిలిచిన ఎల్‌ఐసీ 5 శాతం వాటాను (31.6 కోట్లకుపైగా షేర్లు) రూ.63,000 కోట్లకు విక్రయించేందుకు ఫిబ్రవరి 13న సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో మార్చిలో ప్రారంభం కానుంది. సంస్థ ఉద్యోగులు, పాలసీదార్లకు ఫ్లోర్‌ ప్రైస్‌పై తగ్గింపు లభిస్తుంది. భారతీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ అతి పెద్దదిగా నిలవనుంది. లిస్టింగ్‌ పూర్తి అయితే సంస్థ మార్కెట్‌ విలువ రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టీసీఎస్‌ వంటి అగ్ర శ్రేణి కంపెనీలతో పోల్చవచ్చు.    

చదవండి: చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్‌ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...!

మరిన్ని వార్తలు